హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..!

WNP: పెబ్బేరు మండలం రంగాపురం గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రదీప్ కుమార్, జీపీఓ దేవన్న లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొత్త రేషన్ కార్డులకు అర్హులైన వారు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. స్మార్ట్ కార్డుల ద్వారా పూర్తి వివరాలు ఉంటాయన్నారు.