హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముసలిమడుగులో రూ.2.50 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్

BDK: బూర్గంపాడు మండలం ముసలిమడుగులో శుక్రవారం రూ.2.50 కోట్లతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమిపూజ చేశారు. ఈ సబ్‌స్టేషన్‌తో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు, రైతులకు విద్యుత్ సరఫరా మెరుగుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.