హైదరాబాద్: 28°C
తెలంగాణ

పినపాకలో రేపు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

BDK: పినపాక మండల తహసీల్దార్ కార్యాలయంలో శనివారం ఉదయం 10 గంటలకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్లు తహసీల్దార్ రమేష్ తెలిపారు. అర్హులైన లబ్ధిదారులు కార్యక్రమానికి హాజరుకావాలని సూచించారు.