హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంచలోహాలతో సూక్ష్మ బతుకమ్మ తయారీ

NGKL: కల్వకుర్తి పట్టణానికి చెందిన చింతోజు శేఖరాచారి బతుకమ్మ పండుగ సందర్భంగా పంచలోహాలతో అందమైన సూక్ష్మ బతుకమ్మను తయారు చేశారు. ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ రంగుల స్టోన్స్‌ తో రూపొందించిన ఈ బతుకమ్మ 1.5 అంగుళాల పొడవు, 1.5 అంగుళాల వెడల్పుతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఎంతో నైపుణ్యంతో, సున్నితమైన కళాత్మకత తో ఆయన ఈ బతుకమ్మను రూపొందించడం విశేషమన్నారు.