హైదరాబాద్: 28°C
తెలంగాణ

భీమేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి నిధులు

KMR: తరతరాల చరిత్రకు, భక్తుల నమ్మకానికి ప్రతీకగా సంతాయిపేట్ భీమేశ్వర స్వామి ఆలయం విరాజిల్లుతోంది. మహాశివరాత్రి, మాఘమాసంలో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పుణ్యక్షేత్ర అభివృద్ధికి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆలయ అభివృద్ధి కోసం రూ. 1.80 కోట్ల అంచనా వ్యయంతో నమూనాలు సిద్ధం చేశారు.