హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యుత్ కోతలు ఎత్తివేయాలి'

KMR: వ్యవసాయానికి విధిస్తున్న విద్యుత్ కోతలను తక్షణమే ఎత్తివేసి, 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని మండల బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం భిక్నూర్ మండల కేంద్రంలో మాట్లాడుతూ.. కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.