హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాల

KRNL: ఎమ్మిగనూరు నుంచి మంత్రాలయం వైపు వస్తున్న గుర్తుతెలియని బొలెరో వాహనం, మంత్రాలయం నుంచి ఎమ్మిగనూరు వెళ్తున్న బైకును హాలహర్వి టోల్ గేట్ సమీపంలో ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం బొలెరో ఆపకుండా వెళ్లిపోయింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడి ఎడమ కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి, క్షతగాత్రుడిని అంబులెన్స్‌‌లో ఆసుపత్రికి తరలించారు.