BHPL: కొత్త ఆసరా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు నిరీక్షణ కొనసాగుతోంది. BHPL జిల్లాలో ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు 8,037 మంది దరఖాస్తు చేసుకోగా, 7,088 మందిని అర్హులుగా గుర్తించారు. అయినప్పటికీ, పింఛన్ల మంజూరుపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. 2022 తర్వాత కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారు దసరాకైనా శుభవార్త వస్తుందని ఆశిస్తున్నారు.
తెలంగాణ
దసరాకు కొత్త ఆసరా పింఛన్లు వచ్చేనా?


