హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొప్పుల రవి అరెస్ట్‌పై మండిపడ్డ అంబటి

GNTR: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుందని మాజీమంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. శుక్రవారం గుంటూరులో అంబటి రాంబాబు మాట్లాడుతూ కూటమి ఓటమి భయంతోనే అక్రమ అరెస్టులకు పాల్పడుతుందన్నారు. కూటమి ప్రభుత్వానికి పట్టుకున్న భయం చూస్తుంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుందన్నారు. వైసీపీ అభ్యర్థులు పోటీలో ఉంటారని తెలిపారు.