KRNL: స్థానిక సంస్థల ఎన్నికల బందోబస్తు విధుల కోసం కర్నూలు, నంద్యాల జిల్లాలకు 255 మంది శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లను కేటాయించారు. కర్నూలు జిల్లాకు 138 మంది, నంద్యాల జిల్లాకు 117 మందిని కేటాయిస్తూ పోలీసు డీజీపీ హరీశకుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. కేటాయించిన కానిస్టేబుళ్లు ఆయా జిల్లాల్లో ఎన్నికల బందోబస్తు విధులు నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల బందోబస్తుకు 255 మంది కానిస్టేబుళ్ల కేటాయింపు


