హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంటూరులో మహిళ దారుణ హత్య

GNTR: నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బుడంపాడు వద్ద గుర్తుతెలియని మహిళ మృతదేహం పూర్తిగా కాలిపోయిన స్థితిలో గురువారం లభ్యమైన విషయం తెలిసిందే. కాగా మహిళను హత్య చేసి, గుర్తుపట్టకుండా దహనం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం GGHకు తరలించి, నిందితుల కోసం దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.