హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: కమిషనర్

CTR: పుంగనూరలో పురపాలికలో ఎన్నికల కోడ్ అమలులో ఉందని కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఇవాళ తెలిపారు. ఓటర్లకు నగదు, మద్యం, బహుమతుల పంపిణీ, ప్రభుత్వ వనరుల దుర్వినియోగం, అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేయడం నిషేధమని తెలిపారు. అనుమతి లేని మైకుల వినియోగానికి తావివ్వరాదని స్పష్టంచేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.