హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీశైలంలో వైభవంగా దసరా ఉత్సవాలు

NDL: శ్రీశైలంలో దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. గురువారం 23,859 మంది భక్తులు దర్శించుకోగా, ఉచిత క్యూలైన్ ద్వారా 13,658 మంది స్వామివార్లను దర్శించుకున్నారు. మరో 5,313 మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు.