హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తండ్రిని హత్య చేసిన కుమారుడు అరెస్ట్

అన్నమయ్య: మదనపల్లె మండలం పులగూరవాండ్లపల్లెలో తండ్రిని కట్టెతో కొట్టి హత్య చేసిన కుమారుడు చక్కర సంతోష్‌ (24)ను తాలూకా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 13న మద్యం మత్తులో తండ్రి సహదేవ (50)తో జరిగిన గొడవలో కట్టెతో తలపై కొట్టడంతో ఆయన మృతి చెందారు. నిందితుడి నుంచి హత్యకు ఉపయోగించిన కట్టెను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.