హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్వే ఓకే అంటే టికెట్ ఖాయమేనా?

VSP: జీవీఎంసీ మేయర్ అభ్యర్థి ఎంపికపై టీడీపీ వేగం పెంచింది. ముక్కా శ్రావణి, లొడగల సుజాత పేర్లతో నగరవాసుల అభిప్రాయ సేకరణకు IVRS కాల్స్ నిర్వహిస్తోంది. ఎంపీ, ఎమ్మెల్యేల నుంచి మూడు పేర్ల చొప్పున ప్రతిపాదనలు కోరిన అధిష్ఠానం.. విజయావకాశాల ఆధారంగా మార్కులు వేయాలని సూచించింది. పల్లా లావణ్య, బండారు నందిని, లక్ష్మి, రజనీ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి.