హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సరస్వతీ దేవి రూపంలో రాజరాజేశ్వరి దేవి

VZM: బొండపల్లి మండలంలోని దేవుపల్లి గ్రామంలో స్వయంభూగా వెలసిన రాజరాజేశ్వరీ దేవి ఆలయంలో అమ్మవారు సరస్వతీ దేవిగా పూజలు అందుకున్నారు. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆలయ అర్చకులు దూసి శ్రీధర్ శర్మ అమ్మవారిని అక్షరమాల అలంకరణలో సరస్వతి దేవిగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు.