హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సినిమా రంగానికి విజయవాడే పుట్టినిల్లు: బండ్ల గణేశ్‌

సినిమా రంగానికి విజయవాడ చేసిన సేవలు మరువలేనివని నిర్మాత బండ్ల గణేశ్‌ అన్నారు. ‘విజయవాడ ఉత్సవ్‌ 2.0’లో పాల్గొన్న ఆయన.. తనదైన శైలిలో ప్రసంగించి ఆకట్టుకున్నారు. సినిమాను పుట్టించింది విజయవాడేనని, సినిమా రంగాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది ఈ నగరమేనని కొనియాడారు. కళామ్మతల్లికి విజయవాడ పుట్టినిల్లు అని, ఈ మట్టిలోనే ప్రతిభ ఉందని చెప్పారు.