హైదరాబాద్: 28°C
క్రీడలు

అంతర్జాతీయ క్రికెట్‌కు స్టార్ ప్లేయర్ గుడ్‌బై

భారత సీనియర్‌ బ్యాటర్‌ పూనమ్‌ రౌత్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల ఈ ముంబయి ప్లేయర్‌ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించింది. పూనమ్‌ 2009-21 మధ్య 4 టెస్టులు, 73 వన్డేలు, 35 టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. వన్డేల్లో 2,288 పరుగులు చేసిన పూనమ్‌.. టీ20ల్లో 4 అర్ధశతకాలతో 719 పరుగులు సాధించింది.