హైదరాబాద్: 28°C
తెలంగాణ

NHM ఉద్యోగ దరఖాస్తుల ఫీజు రద్దు చేయాలని వినతి

HNK: జిల్లాలో NHM కింద 58 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ఫీజు రద్దు చేయాలని TSF, TGVP నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు DM&HO డా. అప్పయ్యకు గురువారం వినతిపత్రం అందించారు. ఇతరులకు రూ.500, SC, ST, PH అభ్యర్థులకు రూ.250 ఫీజు నిర్ణయించడాన్ని వ్యతిరేకించారు. ఇప్పటికే చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వాలని కన్నం సునిల్, మేడ రంజిత్ కోరారు.