హైదరాబాద్: 28°C
తెలంగాణ

వేములవాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు

SRCL:వేములవాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. చెక్కపల్లి గ్రామానికి చెందిన మహిళా రైతుకు ల్యాండ్ గిఫ్ట్ డీడీకి సంబంధించిన పనిలో రూ.8 వేల లంచం తీసుకున్నారనే ఆరోపణలపై తహసీల్దార్, వీఆర్ఏ ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు సమాచారం. డీఎస్పీ ఆధ్వర్యంలో కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి.