హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

కృష్ణా: మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. అతివేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన కొమ్ము ప్రేమ్ కుమార్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.