హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్సై

NLR: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గురువారం బోగోలు మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను బిట్రగుంట ఎస్సై రామకృష్ణ పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాల పరిస్థితులను ఆయన క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై దృష్టి సారించారు.