హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అవమానం భరించలేక రాజీనామా చేసాం'

NLR: టీడీపీలో జరుగుతున్న అవమానాలు భరించలేక రాజీనామా చేస్తున్నామని టీడీపీ సీనియర్ నేత ఎర్రం రెడ్డి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. బుచ్చి మండలం పంచెడులో టీడీపీ మండల సురా శ్రీనివాసులు రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 2024 ఎన్నికలలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశామన్నారు. కోటరీతో అవమానాలు భరించలేకపోతున్నామని వాపోయారు.