హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'మహిళలు అప్రమత్తంగా ఉండాలి'

NDL: రైలు ప్రయాణాల్లో మహిళలు జాగ్రత్తలు పాటించాలని శక్తి టీమ్ హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ వెంకటేశ్వర్లు సూచించారు. గురువారం నంద్యాల రైల్వే స్టేషన్‌లో మహిళలకు శక్తి యాప్‌పై అవగాహన కల్పించారు. కదులుతున్న రైలు ఎక్కరాదని, అపరిచితులు ఇచ్చే ఆహార పదార్థాలు తీసుకోరాదని సూచించారు. బంగారు, వెండి ఆభరణాలు, విలువైన వస్తువులను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని కోరారు.