హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికలకు వైసీపీ శ్రేణులు సిద్ధం కావాలి'

ప్రకాశం: కనిగిరి వైసీపీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ ఆదేశాల మేరకు గురువారం పెదచెర్లోపల్లిలో మండల పార్టీ అధ్యక్షుడు గోపవరపు బొర్రారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే నాయకులు పేర్లు నమోదు చేసుకుని అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.