హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై మంత్రి సమీక్ష

JGL: 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని జగిత్యాల జిల్లాలో చేపట్టాల్సిన ఏర్పాట్లు, అభివృద్ధి పనులపై సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.