NDL: వ్యవసాయ రంగంలో మహిళా రైతుల పాత్ర ఎంతో కీలకమని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం వందేమాతరం మీటింగ్ హాల్లో మహిళా రైతుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, మహిళా శాస్త్రవేత్తలు ఆధునిక సాగు పద్ధతులు, అధిక దిగుబడుల సాధనపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మహిళా రైతులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మహిళా రైతులకు ఆధునిక సాగుపై అవగాహన


