హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బజార్‌లో మురుగు నీరు.. స్థానికుల ఇక్కట్లు

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని 8వ సచివాలయం పక్కన ఉన్న కొలిమి బజార్‌లో కాలువల్లో పూడిక తొలగించకపోవడంతో గురువారం కురిసిన వర్షానికి మురుగు నీరు రోడ్లపైకి చేరింది. దీంతో అటుగా రాకపోకలు సాగించే స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి కాలువల్లో పూడిక తొలగించి, మురుగు నీటి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.