హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కేసీఆర్ హయాంలో 24 గంటల విద్యుత్ ఇచ్చాం'

KMR: విద్యుత్ కోతలకు సీఎం వైఫల్యమే కారణమని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విమర్శించారు. గురువారం తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. తన తప్పిదాలను అధికారులపై నెట్టేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో 24 గంటల విద్యుత్ అందించామని, ఇప్పుడు కోతలు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. ఎల్‌నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటే తెలంగాణలోనే విద్యుత్ కోతలు ఎందుకని నిలదీశారు.