హైదరాబాద్: 28°C
తెలంగాణ

టైగర్ జోన్ ఎత్తివేయాలని డిమాండ్

MNCL: జన్నారం మండల ప్రజలకు నష్టం చేస్తున్న టైగర్ జోన్‌ను ప్రభుత్వాలు వెంటనే రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బొప్పని పద్మ డిమాండ్ చేశారు. టైగర్ జోన్ రద్దు చేయాలనుకుంటూ మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేస్తున్న సామాజిక పోరాట సమితి భూమాచారికి సీపీఎం నాయకులతో కలిసి ఆమె గురువారం మద్దతు తెలిపారు.