హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ స్థాయి పోటీలకు జిల్లా విద్యార్థులు

GDWL: అలంపూర్‌లో అక్టోబర్ 12-14 వరకు రాష్ట్రస్థాయి SGF అండర్-17 హాకీ పోటీలు అధికారులు నిర్వహించారు. జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మాంటిస్సోరి పాఠశాల విద్యార్థులు ప్రణవ్ తేజ, తరుణ్ జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు నాగలక్ష్మి వారిని అభినందించారు. మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.