హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓటరు నమోదు శిబిరాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో

KMR: అర్హులైన ప్రతి ఒక్కరినీ కొత్త ఓటరుగా నమోదు చేయించాలని బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి అన్నారు. బీర్కూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాన్ని ఆయన తనిఖీ చేశారు. 2026 అక్టోబర్‌ 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.