హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీఐ

ASR: రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గొందిపాకల పంచాయతీ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను చింతపల్లి సీఐ బి. సింహాచలం గురువారం పోలీసు సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఎన్నికల ఏర్పాట్లు, ఓటర్లకు మౌలిక వసతులు, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆరా తీశారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.