హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీబీనగర్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

BHNG: బీబీనగర్‌లో ఇవాళ అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కార్యక్రమానికి హాజరై స్వయంగా స్మార్ట్ కార్డులు అందించారు.పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.