NRML: మామడ (M) బండల్ ఖానాపూర్ శివారులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెంబి మండలం అంకెన గ్రామానికి చెందిన లావుడ్య సంతోష్ (43) మృతి చెందాడు. స్వగ్రామానికి బైక్పై తిరిగి వస్తుండగా రోడ్డుపైకి అడవి జంతువులు అడ్డురావడంతో వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. సంతోష్ అక్కడికక్కడే మృతి చెందగా, భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై హనుమండ్లు తెలిపారు.
తెలంగాణ
అడవి జంతువులు అడ్డురావడంతో ప్రమాదం.. వ్యక్తి మృతి


