KNR: కరీంనగర్ రూరల్ పరిధిలోని కోతిరాంపూర్ చిన్నారులు డంపింగ్ యార్డు పొగతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం మాస్కులు ధరించి ‘సేవ్ అవర్ హెల్త్.. సేవ్ అవర్ కరీంనగర్’ అంటూ నినాదాలు చేశారు. డంపింగ్ యార్డును వెంటనే తరలించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. చిన్నారి కంది రియా రెడ్డి సహా పలువురు ఈ నిరసనలో పాల్గొన్నారు.
తెలంగాణ
‘సేవ్ అవర్ కరీంనగర్’ అంటూ చిన్నారుల నిరసన


