హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు ఎమ్మెల్యే మద్దతు

NZB: నగరంలోని ఎన్టీఆర్‌ చౌరస్తాలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు చేపట్టిన ధర్నాకు అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ గురువారం మద్దతు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తున్నప్పుడు తెలంగాణలో ఎందుకు సాధ్యం కావడం లేదని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు.