MNCL: చెన్నూర్ పట్టణ గ్రంథాలయం తెరవడంలో సిబ్బంది అలసత్వం వహిస్తున్నారని విద్యార్థులు, పాఠకులు ఆరోపించారు. ఉదయం 11 గంటలైనా గ్రంథాలయం తెరవకపోవడంతో పుస్తకాలు చదివేందుకు వచ్చేవారు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు పర్యవేక్షణ పెంచి, నిర్ణీత సమయానికి గ్రంథాలయం తెరిచేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
11 గంటలైనా తెరుచుకోని చెన్నూర్ గ్రంథాలయం


