హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నరసరావుపేట మున్సిపల్ ఎన్నికలపై క్లారిటీ

PLD: నరసరావుపేట మున్సిపల్ ఎన్నికలు రెండో విడతలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. గతంలో కోర్టు కేసుల కారణంగా ఎన్నికల ప్రక్రియ ఆలస్యమైందని, ప్రస్తుతం కోర్టు కేసులు పరిష్కారం కావడంతో డీలిమిటేషన్, ఓటర్ల జాబితా తదితర ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉందని పేర్కొన్నారు. నవంబర్ 15 తర్వాత నరసరావుపేట మున్సిపల్ ఎన్నికలు జరగవచ్చని చెప్పుకొచ్చారు.