VZM: ఎల్.కోట మండలాన్ని పూర్తిస్థాయి కరువు మండలంగా ప్రకటించాలని కల్లేపల్లి, రేగ గ్రామాల రైతులు డిమాండ్ చేశారు. గురువారం బీజేపీ మండల అధ్యక్షుడు కోన మోహన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వర్షాలు లేకపోవడంతో పంటలు దెబ్బతిని, పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి మండలాన్ని పూర్తిస్థాయి కరువు మండలంగా ప్రకటించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి


