హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కనకదుర్గమ్మకు అన్నవరం తరపున పట్టు వస్త్రాలు

KKD: దేవి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం తరఫున గురువారం పట్టు వస్త్రాలు సమర్పించారు. దేవస్థానం చైర్మన్, ఈఓ చక్రధరరావు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.