హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంచాయతీ నిధుల ఖర్చుపై స్పష్టత ఏదీ?

BDK:బూర్గంపాడు గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు, నిధుల వినియోగంపై చర్చ జరుగుతోంది. చేపట్టిన పనుల వివరాలు, ఖర్చుల లెక్కలను ప్రజలకు వెల్లడించాలని పలువురు కోరుతున్నారు. పంచాయతీ నిధులు ఏయే పనులకు ఖర్చు చేశారో సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించి, నిధుల వినియోగంలో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేస్తున్నారు.