హైదరాబాద్: 28°C
తెలంగాణ

సౌదీలో జగిత్యాల యువకుడి దుర్మరణం

JGL: కోరుట్ల అనుబంధ గ్రామం ఎకీన్పూర్‌కు చెందిన కాశిరెడ్డి రాకేష్ (25) సౌదీ అరేబియాలో మంగళవారం జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. జిజాన్‌లో రిగ్గర్‌గా పనిచేస్తున్న రాకేష్ విధుల్లో భాగంగా క్రేన్‌తో పనులు చేస్తుండగా పైపు మీద పడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. రాకేష్ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమారుడు కావడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.