హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల నిబంధనలు పక్కాగా అమలు చేయాలి

NDL: జిల్లా కలెక్టరేట్‌లోని PGRS హాలులో మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ జి. రాజకుమారి ఎన్నికల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయడంతోపాటు ఎన్నికల విధివిధానాలు, నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు.