హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్తగట్టులో వారం రోజులుగా తాగునీటి వృథా

KNR: శంకరపట్నం మండలం కొత్తగట్టులోని మూడో వార్డు పాఠశాల సమీపంలో మిషన్ భగీరథ పైప్‌లైన్‌ పగిలి వారం రోజులుగా తాగునీరు వృథాగా పోతోంది. గ్రామంలో నీటి కొరత ఉన్నప్పటికీ మరమ్మతులు చేపట్టకపోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి పైప్‌లైన్‌కు మరమ్మతులు చేసి నీటి వృథాను అరికట్టాలని మూడో వార్డు సభ్యుడు పిట్టల సమ్మయ్య కోరారు.