హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ కేవైసీ ప్రక్రియను పరిశీలించిన వ్యవసాయ శాఖ జెడి

VZM:గంట్యాడ మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రంలో గురువారం ఈ-పంట ఈ-కేవైసీ ప్రక్రియను వ్యవసాయ శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ రామారావు తనిఖీ చేశారు. ఇప్పటివరకు పూర్తయిన ఈ-కేవైసీ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏవో శ్యామ్ కుమార్, ఏఈవో సునీల్ కుమార్ పాల్గొన్నారు.