హైదరాబాద్: 28°C
తెలంగాణ

గండీడ్‌లో నిలిచిన భూ రిజిస్ట్రేషన్లు

MBNR: గండీడ్ మండల తహసీల్దార్ కార్యాలయంలో భూ రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. 2 రోజులుగా భూ భారతి సర్వర్ పనిచేయక పనులు ఆగిపోయాయని అధికారులు తెలిపారు. గురువారం సర్వర్ అందుబాటులోకి వచ్చినా, ఎమ్మార్వో అందుబాటులో లేకపోవడంతో రిజిస్ట్రేషన్లు జరగలేదు. దీంతో భూముల పనుల కోసం వచ్చిన ప్రజలు కార్యాలయంలో, చెట్ల కింద కూర్చొని నిరీక్షించారు.