హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోలాం సంఘం అధ్యక్షుడిగా సిడాం భీంరావు ఎంపిక

ASF: కెరమెరి మండల కోలాం సంఘం అధ్యక్షుడిగా సిడాం భీంరావు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోలాం ప్రజల అభివృద్ధి, సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు. అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడటంతోపాటు, ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. కోలాం సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పాటు యువతకు విద్య, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పిస్తానని పేర్కొన్నారు.