హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన డీఐజీ

ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయాన్ని కాళేశ్వరం మల్టీజోన్‌-1 డీఐజీ అంబర్ కిషోర్ ఝా గురువారం తనిఖీ చేశారు. డీసీఆర్‌బీ, కమాండ్ కంట్రోల్ తదితర విభాగాలను పరిశీలించి రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. అనంతరం పోలీస్ నియామక శిక్షణ పొందుతున్న 160 మంది అభ్యర్థులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ నితికా పంత్ పాల్గొన్నారు.