హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఉపాధి పనుల వద్దే మహిళల బతుకమ్మ సందడి

సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లిలో మహిళలు ఉపాధి పనుల వద్దే ఇవాళ బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. అటవీ ప్రాంతంలో లభించిన తంగేడు పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ ఉత్సాహంగా ఆడిపాడారు. పని ప్రదేశంలోనే పండుగ వాతావరణం నెలకొనగా మహిళల సంబరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.